ఏపీలో నేడు మిశ్రమ వాతావరణం.. కొన్నిచోట్ల వర్షాలు, మరికొన్నిచోట్ల అధిక ఉష్ణోగ్రతలు
- ఏపీలో జూన్ 4న మిశ్రమ వాతావరణం
- అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు
- పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు తదితర జిల్లాల్లో 43 – 45 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపింది.
పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 – 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పింది. ద్రోణి ప్రభావంతో మరోవైపు మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు సహా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురస్తాయని పేర్కొంది.
ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లవద్దని, వర్షాల సమయంలో పిడుగుల నుంచి రక్షణ పొందాలని అధికారులు సూచించారు.